Home రాజకీయాలు నాదెండ్లది స్వార్ధ రాజకీయ౦….మరి తెదేపా తో మీపొత్తునేమందాం సార్?

నాదెండ్లది స్వార్ధ రాజకీయ౦….మరి తెదేపా తో మీపొత్తునేమందాం సార్?

SHARE

కాంగ్రెస్ ను వీడి జనసేనలో ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరడం పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గా ఎన్నికై ఆపై డిప్యూటీ స్పీకర్, స్పీకర్ పదవు లను అనుభవించిన మనోహర్ ను ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేరా? అంటూ రఘువీరా ప్రశ్నించారు.

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి మహానేతలు కూడా ఓటమి పాలైనప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారనే విషయ౦ గుర్తు చేసిన కాంగ్రెస్ నేత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ లో చేరారని అన్నారు.

ఇంకా మనోహర్ ను జనసేనలో చేర్చుకోవడం సరైన పని కాదని కూడా అన్నారు. ఏపీ లో ఎంపీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే అని నొక్కి వక్కాణించారు. అసెంబ్లీ సీట్ల కోసం కూడా తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

అయితే మనోహర్ వి స్వార్ధపూరిత రాజకీయమైతే…తెలంగాణ లో తెదేపా తో మీ పార్టీ పొత్తు ని నిస్వార్ధపూరితం అందామా రఘువీరా సార్? మీరు చేసేదంతా మంచి ఎదుటివారు చేసేది స్వార్దానికా? బాగుంది తమ లాజిక్!!