Home రాజకీయాలు ఐటీ దాడులు.. ఓటుకు నోటు డొంక కదులుతోందా?

ఐటీ దాడులు.. ఓటుకు నోటు డొంక కదులుతోందా?

SHARE

మొన్న కొంతమంది తెలుగుదేశం నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత సీఎం రమేశ్ వంతు వచ్చింది. ఇలా సెలెక్టివ్ గా కొందరి నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగడానికన్నా ముందు.. రేవంత్ రెడ్డి ని ఐటీ శాఖ అధికారులు విచారించారు. రేవంత్ రెడ్డిని విచారించాకే ఏపీలో ఐటీ దాడులు జరగడం కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింటే.

రేవంత్ ఇచ్చిన క్లూస్ ప్రకారమే ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఇచ్చిన యాభై లక్షలు ఎక్కడివి? ఆపై ఇస్తామన్న నాలుగున్నర కోట్ల రూపాయలను ఎవరి నుంచి తెద్దామనుకున్నారు? అనే అంశాలనే రేవంత్ వద్ద ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. బయట చాలా మాటలు మాట్లాడే రేవంత్.. విచారణలో మాత్రం కొన్ని క్లూస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఏపీలో ఐటీ శాఖ దాడులు ఊపందుకున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన డబ్బు మూలాల గురించినే శోధించినట్టుగా తెలుస్తోంది.

కొంతమంది తెలుగుదేశం నేతలు, సీఎం రమేశ్ ఇళ్లపై ఐటీ దాడులతో ఈ వ్యవహారంపై అధికారులకు కొంత క్లూస్ కూడా దొరికాయని టాక్. అయితే సీఎం రమేశ్ మాత్రం తన ఇంట్లో ఏ ఆధారాలూ దొరకలేదు అని.. ఎలాంటి పత్రాలూ స్వాధీనం చేసుకోలేదని చెబుతున్నాడు. తన ఇంట్లో కూర్చొని ఐటీ అధికారులు టీవీ చూసి వెళ్లారని కబుర్లు చెబుతున్నాడు.