Home రాజకీయాలు తెలంగాణ టీడీపీకి కొత్త కష్టాలు..!

తెలంగాణ టీడీపీకి కొత్త కష్టాలు..!

SHARE

అసలే మూలిగే నక్కలా మారింది తెలంగాణ టీడీపీ. ఇలాంటి సమయంలో చేసేది లేక తమ ఆ జన్మ శత్రువు కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపేసింది. అసలుకు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేతులు కలపడం అంటే అంతకన్నా హీనం లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది కాంగ్రెస్ వ్యతిరేకత మీద. అలాంటిది ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలపడం అంటే అది టీడీపీ పతనావస్థకు నిదర్శనం. ఆ విషయం స్పష్టం అయిపోతోంది.

ఇలా టీడీపీ వెళ్లి కాంగ్రెస్ తో చేతులు కలిపినా.. ఆ పార్టీ కష్టాలు తీరినట్టుగా కనిపించడం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దేన్నీ డిమాండ్ చేసే స్థితి లో లేదు. చివరకు సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్ చెప్పినట్టుగా ముందుకు పోతోంది. కాంగ్రెస్ ఏవో కొన్ని సీట్లు ఇస్తానంటే తెలుగుదేశం ఓకే అంటోంది.

తాము చాలా బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నా చివరకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లతో తెలుగుదేశం సంతోష పడాల్సి వస్తోంది. ఇదీ పరిస్థితి. అదే అనుకుంటే.. అలా బయటపడేస్తామని తెలుగుదేశం ఆశిస్తుంటే.. ఇప్పుడు మహాకూటమికి తూట్లు పడే పరిస్థితి వచ్చింది. కోదండరాం కాకపుట్టిస్తున్నాడు. కోరినన్ని సీట్లు అంటున్నాడు.

ఒకవేళ కోదండరాం గనుక మహాకూటమి నుంచి బయటకు వస్తే ఆయనకు డిమాండ్ ఉంది. బీజేపీ వాళ్లు ఆయనతో స్నేహానికి సై అంటున్నారు. ఇదీ పరిస్థితి. అదే కోదండరాం ధైర్యం. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ టెన్షన్ పడుతోంది. ఎక్కడ కోదండరాం కూటమిని వీడతాడో అనే భయంతో పచ్చ పార్టీ వాళ్లు ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇదీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ధైన్య స్థితి.