Home రాజకీయాలు పవన్, జగన్ కలిస్తే.. లోకేష్ లెక్కలు.. భలే ఉన్నాయే!

పవన్, జగన్ కలిస్తే.. లోకేష్ లెక్కలు.. భలే ఉన్నాయే!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కలవాలి అనేది కొంతమంది ఆశ. లెక్క. ప్రత్యేకించి ఆంధ్రాలో కాపుల్లో ఈ అభిప్రాయాలున్నాయి. జగన్, పవన్ లు కలవాలని.. చంద్రబాబు నాయుడుని చిత్తుగా ఓడించాలని అక్కడి వారు  కోరుకుంటూ ఉన్నారు. అటు పవన్ ను పోగొట్టుకోలేక  ఇటు జగన్ కు దూరం కాక ఇలా మాట్లాడేవాళ్లు కొందరున్నారు.

ఒకవేళ జగన్, పవన్ లు కలిస్తే చంద్రబాబు నాయుడు చిత్తే అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు వాళ్లు. అయితే జగన్, పవన్ కలిసే అవకాశాలు మాత్రం ప్రస్తుతానికి కనపడటం లేదు. పవన్ కల్యాణ్ అనవసరంగా జగన్ ను విమర్శిస్తూ ఉన్నాడు. అది కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఇక జగన్ ఏమైనా అంటే.. జనసేన టీమ్ ఇంకా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంది. ఇక జగన్ కూడా సొంతంగా సత్తా చాటగలను అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో పవన్, జగన్ ల కలయిక సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

ఆ సంగతలా ఉంటే.. నారా లోకేష్ బాబు  మాత్రం పవన్, జగన్ కలవాలని కోరుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. పవన్, జగన్ కలవాలని లోకేష్ అంటున్నాడు. వారిద్దరూ కలిస్తే తమకు తిరుగులేదని అంటున్నాడు.

పవన్, జగన్ కలిసి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ 150కి పైగా సీట్లలో నెగ్గుతుందని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పవన్, జగన్ లు కలిసి బీజేపీని కూడా కలుపుకుని పోటీ చేస్తే అప్పుడు తమకు తిరుగే లేదని 174 స్థానాలు వస్తాయని లోకేష్ చెప్పుకొచ్చాడు.కోల్పోయే స్థానం పులివెందుల ఒకటే  అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కలు వింటుంటే.. లోకేష్ కు అసలు మతుందా? ఇందుకు కదా. .అతడిని పప్పు అనేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.