Home రాజకీయాలు కాంగ్రెస్ పడవ నుంచి ఇంకా ఎవరెవరు దూకుతారు?

కాంగ్రెస్ పడవ నుంచి ఇంకా ఎవరెవరు దూకుతారు?

SHARE

గత ఎన్నికల ముందే చాలా మంది కాంగ్రెస్ ను వీడారు. అటు తెలుగుదేశంలోకి కొందరు..ఇటు వైసీపీలోకి మరికొందరు దూకేశారు. ఇక మిగతా వాళ్లు కొందరు ఎన్నికలు అయ్యాకా దూకారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఒకప్పుడు అత్యంత బలం ఉన్న పార్టీ. దశాబ్దాలుగా ఏలిన పార్టీ. అయితే జగన్ సొంత పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత చేసిన రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పతనం సంపూర్ణం అయ్యింది.

అయితే ఇప్పటికీ ఆ పార్టీలో కొన్ని చిన్న చిన్న చేపలు మిగిలాయి. గతంలో వీళ్లు మంచి పదవులు అనుభవించిన వారు కావడమే వీరి అర్హత. వీళ్లకు ప్రజల్లో బేస్ మెంట్ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకే బేస్ లేకుండా పోయాకా వీళ్లకు మిగిలింది ఏమీ లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికి మిగిలి ఉండిన ఒకరిద్దరు నేతలు కూడా వేరే దిక్కులను చూసుకుంటున్నారు. వీరిలో తాజాగా కాంగ్రెస్ పడవను దూకిన వ్యక్తి నాదెండ్ల మనోహర్. అటు వైసీపీ వైపు కాకుండా, ఇటు తెలుగుదేశం వైపు కాకుండా జనసేన వైపు దూకాడు నాదెండ్ల. ఈయన కాంగ్రెస్ ను వీడతాడని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. చివరకు అదే జరిగింది.

కేవలం నాదెండ్ల మాత్రమే కాదు.. ఇంకా మరికొందరు కూడా కాంగ్రెస్ ను వీడే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో ఒకరిద్దరు నేతలు జగన్ పార్టీలోకి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా సమాచారం. ఆ వికెట్లు కూడా త్వరలోనే పడవచ్చు. అసలైన కామెడీ ఏమిటంటే.. రఘువీరారెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు ఉండటం. వైసీపీ నుంచి కానీ, ఇటు తెలుగుదేశం నుంచి కానీ.. కచ్చితమైన హామీ వస్తే.. సీటు విషయంలో భరోసాని ఇస్తే ఈయన కూడా కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీలోకి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పార్టీని తెలుగుదేశం భజన మీడియా మాత్రం మోస్తోంది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బలోపేతం అవుతోందని ప్రచారం చేస్తోంది.