Home రాజకీయాలు సర్వే ఎఫెక్ట్.. టీడీపీ సిట్టింగులు చేతులెత్తేస్తున్నారా?

సర్వే ఎఫెక్ట్.. టీడీపీ సిట్టింగులు చేతులెత్తేస్తున్నారా?

SHARE

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయానికి ముఖ్య కారణం.. అలవిగాని హామీలు. దాదాపు ఆరువందల హామీలతో సింగపూర్ స్వప్నాలతో జనాలను ఊదరగొట్టాడు చంద్రబాబు నాయుడు. ఇక మోడీ విషయంలో ఏపీలో కూడా ఉండిన అంచనాలు, పవన్ కల్యాణ్ మద్దతు.. ఇవన్నీ కూడా తెలుగుదేశం విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఆ కోణం నుంచి చూస్తే.. చంద్రబాబుకు, తెలుగుదేశానికి ఇప్పుడు పవన్ మద్దతు లేదు. మోడీ హవా అండగా లేదు. ఇక హామీల అమలు విషయంలో చంద్రబాబు నాయుడు జనాల నుంచి అసహనాన్ని ఎదుర్కొంటున్నాడు. వీటన్నింటికీ తోడు.. ప్రభుత్వ వ్యతిరేకత. తన పాలనతో దీన్ని పుష్కలంగా పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ కథ అయిపోయిందని.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ కి నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీల్లో కలవర పాటు మొదలైనట్టుగా ఉంది. మొన్నామధ్య తెలుగుదేశం అనుకూల పత్రికలు.. టీడీపీ తరఫున 12 మంది సిట్టింగులు అలాగే బరిలోకి దిగుతారని వార్తలు రాశాయి. అయితే.. ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. వీరిలో చాలా మంది మళ్లీ తమకు అవే సీట్లలో టికెట్ అంటే పోటీకి నో అంటున్నారని సమాచారం.

గత ఎన్నికల నాటి సమీకరణాలు ఇప్పుడు లేనే లేవు. అప్పుడు అన్నీ కలిసి వస్తే అంతంత మాత్రం మెజారిటీలతో బయటపడ్డారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అదనం అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది సిట్టింగు ఎంపీలు పోటీకి నో అంటున్నారని.. ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.