Home సినిమా అబ్భా….క్రిష్ ఇలా ఎలా?

అబ్భా….క్రిష్ ఇలా ఎలా?

SHARE

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతంగా రూపొందుతోంది. బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాను ‘కథానాయకుడు’ .. ‘మహానాయకుడు’ అని రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇకపోతే కథానాయకుడిగా ఎన్టీఆర్ హీరోయిన్ శ్రీదేవి తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అవన్నీ కూడా బాస్ ఆఫీస్ వద్ద ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. కాబట్టే బయోపిక్ లో శ్రీదేవి పాత్రకు ప్రాముఖ్యత వచ్చింది.

ఇక ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో ‘వేటగాడు’ ఒకటి. ఇందులో ‘ఆకుచాటు పిందె తడిసే’ పాట ఎవర్ గ్రీనే. జూనీయర్ ఎన్టీఆర్ తో కూడా ఈ పాటను రీమిక్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్నారు. ఈ మధ్య ఆకు చాటు పాటను బాలకృష్ణ – రకుల్ పై చిత్రీకరించారు.

రకుల్ పుట్టినరోజైన ఈ రోజు రకుల్ ఫస్టు లుక్ ను టీం వదిలింది. ఇక కొద్ది సేపటి క్రితం ‘ఆకు చాటు పిందె తడిసే’ పాటలో స్టిల్ ను రిలీజ్ చేశారు. నందమూరి అభిమానులనే కాకుండా యావత్తు సినీ అభిమానులను హుషారెత్తించేలా పోస్టర్ వుంది. ఇంతలా ఆ మేజిక్ ని మళ్ళీ మనకు చూపగలిగిన దర్శకుడు క్రిష్ ని అభినందించాల్సిందే.