Home రాజకీయాలు ఎన్నికల సర్వే….జనా సుఖినో భవంతు..!!

ఎన్నికల సర్వే….జనా సుఖినో భవంతు..!!

SHARE

ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ ఎవరికివారు తామంటే తామే ఎన్నికలలో గెలుపొందుతామని సర్వేలు బయటపెడుతున్నట్టు వుంది….జనం ఆభిప్రాయ౦ అలానే వుంది. తెలంగాణ లో ఓ సర్వే కాంగ్రెస్‌ ది విజయ౦ అంటే మరో సర్వే టీఆర్ఎస్‌ కు అనుకూలంగా ఇచ్చింది.

ఇక ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్,తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌ఘడ్ లలో సీ ఓటర్, టైమ్స్ నౌ, ఐటి టెక్ సంస్థలు సర్వే లు నిర్వహించాయి. సర్వేలన్నింటిని క్రోడీకరించి చూస్తే రాజస్థాన్‌, ఛత్తీస్ ఘడ్‌ లలో భాజపా కి గడ్డు కాలమే…ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో చచ్చీ చెడి బిజెపి నిలబడ గలుగుతుందని, ఇక తెలంగాణలో టీఆర్ఎస్‌ కే విజయావకాశాలు వున్నాయని తెలుస్తోంది.

మరి ఈ సర్వేలన్నీ ఎన్నికల దగ్గర పడుతున్నకొద్దీ జనంపై ప్రభావం చూపుతాయా లేదంటే జన౦ నాడే సర్వేలలో ప్రతిబింబిస్తున్నాయా అన్నది వేచి చూడాల్సిందే.