Home రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నటుడు: పవన్

చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నటుడు: పవన్

SHARE

ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి తాము పోరాడుతున్నామని, ‘హోదా కావాలి’ అన్న మాటమీద కట్టుబడి ఉన్నామని…అయితే హోదాని వ్యతిరేకించింది, మాట మార్చింది సీఎం చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. పవన్మా ట్లాడుతూ, ‘మన ముఖ్యమంత్రి అద్భుతమైన నటుడు. ఆయన చెప్పిన మాటలు ఆయనే మర్చిపోయారు.‘స్పెషల్ కేటగిరి స్టేటస్ వద్దని నేను చెప్పలేదు’ అని ఆయన అంటారు. ఆయన మాటలు ఆయనకు రికార్డు చేసి చూపించినా.. సాక్ష్యం చూపించినా కూడా, ‘ఎవరో అన్నారు నేను కాదు’ అని ఆయన అంటారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు నాయుడు హోదాపై యూ టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న బాబు…తరువాత కాలంలో హోదానే ఆంధ్రుల హక్కు అంటూ ధర్మ పోరాట దీక్షలు మొదలుపెట్టారు. అసలు ప్యాకేజీ వార్త రాగానే ఆర్ద్రాత్రి కృతజ్ఞత తీర్మానం పెట్టిన ఘనత కూడా బాబుదే.