Home రాజకీయాలు లోకేష్ కామెడీ.. ఏమిటీ మాటలు..!

లోకేష్ కామెడీ.. ఏమిటీ మాటలు..!

SHARE

నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్.. మాటల విషయంలో తన ప్రావీణ్యాన్ని చాలా సార్లే నిరూపించుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు మీరే ఉరేసుకున్నట్టు అని చెప్పినా, కులపిచ్చి మతపిచ్చి బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే అని తేల్చేసినా.. లోకేష్ చెప్పినంత స్పష్టంగా ఎవ్వరూ చెప్పరు.

అలాంటి మాటలే కాదు.. ఏదో సీరియస్ గా చెప్పబోయి కామెడీ అయిపోవడం కూడా లోకేష్ కు మామూలే. ఈ పరంపరలో మరోసారి లోకేష్ మాటలు ప్రహసనం పాలయ్యాయి. ఐటీ దాడుల విషయంలో లోకేష్ స్పందించిన తీరు ఇలా ఉంది.

ఇంతకీ లోకేష్ ఏమంటాడంటే.. ఏపీలో ఆదాయపన్ను శాఖ సోదాలను తప్పు పడుతూ.. ఇలా సోదాలు జరిపితే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అని తేల్చాడు లోకేష్. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చెప్పనక్కర్లేదు. దేశంలో ఐటీ శాఖ అనేది ఉన్నది ఎవరైనా ఆదాయ పన్నును చెల్లించడంలో అక్రమాలకు పాల్పడితే వారి భరతం పట్టడానికి. తమకున్న సమాచారం మేరకు, అక్రమాలను నిర్ధారించుకుని ఆ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఆ మేరకు ఏపీలో కూడా చాలా మంది వ్యాపారుల సామ్రాజ్యాలపై సోదాలు జరిగాయి. ఇలాంటి అక్రమార్కుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఉన్నారు. ఇది లోకేష్‌కు కోపం తెప్పిస్తోంది. తమ వాళ్లు అక్రమాలు చేసినా వారిని అలా వదిలేయాలి తప్ప ఏమీ అనకూడదని లోకేష్ చెబుతున్నాడు. సోదాలు నిర్వహిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అంటూ.. అక్రమాలను ప్రోత్సహించాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దటీజ్ లోకేష్ బాబు.