Home రాజకీయాలు సీబీఎన్ గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం…కేటీఆర్ సెటైర్

సీబీఎన్ గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం…కేటీఆర్ సెటైర్

SHARE

తెదేపా కాంగ్రెస్ ల పొత్తు పై ఇటు ఆంధ్ర లోను అటు తెలంగాణ లోను బాబు రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్లను బయటకు తీశారు. బాబు చేసిన ఆయా ట్వీట్లను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తిరిగి రీ ట్వీట్ చేశారు.

‘అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి పరచడమే మన లక్ష్యం. అది సాధించడానికి ఏం చేస్తే ఉత్తమమో మనం అది చేద్దాం. మన నిస్వార్థ కూటమి గురించి చరిత్రే చెబుతుంది’ అని 24/03/2014లో చంద్రబాబు ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేసి .. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ అని బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక రాహుల్ పై… ‘తెలంగాణపై రాహుల్, సోనియాలు కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ దుర్మార్గమైంది. తెలంగాణకు చివరిసారిగా వాళ్లు వచ్చింది ఎప్పుడు? అభివృద్ధి కోసం వాళ్లు చేసిందేమిటి?’ అని 26/04/2014న చంద్రబాబు ట్వీట్ గురించి ప్రస్తావించిన కేటీఆర్..‘సీబీఎన్ గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం’ అని ఓ సెటైరేశారు.