Home రాజకీయాలు ఎన్నికల్లో ఓడితే చంద్రబాబు..అలా చేస్తాడా?

ఎన్నికల్లో ఓడితే చంద్రబాబు..అలా చేస్తాడా?

SHARE

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అంటున్నారు… ఈ మాట అంటున్నది తెలంగాణ నేత నాయిని నర్సింహారెడ్డి. పాలిటిక్స్‌కు మోస్ట్ సీనియర్ అయిన నాయిని ఈ కామెంట్ చేశాడు. ఏపీలో రాబోయేది జగనే అని స్పష్టం చేశాడు నాయిని. చంద్రబాబుకు ఓటమి తప్పదని ఈయన తేల్చేశాడు. అంతే కాదు.. ఏపీలో ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు ఏం చేయబోతున్నాడో కూడా నాయిని స్పందించాడు.

ఏపీలో ఓడిపోగానే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చి సెటిలవుతాయని నాయిని అన్నాడు. అందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని, పనిలో పనిగా తను హైదరాబాద్‌కు వచ్చి సెటిల్ కాగానే ఇక్కడ తనకు సాయంగా ఉండేందుకు నలుగురైదుగురు ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నాడని, ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తూ.. మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నాడని నాయిని అన్నారు.

ఒకరకంగా చూస్తే నాయిని కామెంట్లలో వాస్తవం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓడిపోతే చంద్రబాబు నాయుడు టక్కున హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోతాడు. అందులో సందేహం ఏమీ లేదు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో భారీ సౌధాన్ని కూడా నిర్మించుకుంది చంద్రబాబు నాయుడి కుటుంబం.

ఒకవైపు ఉద్యోగులను బలవంతంగా అమరావతి తీసుకెళ్లాడు బాబు. ఉమ్మడి రాజధానిగా ఏపీకి హైదరాబాద్ పై పదేళ్ల పాటు హక్కులున్నా వాటిని బాబు కేసీఆర్‌కు తాకట్టు పెట్టాడు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని అమరావతి చేరుకున్నాడు. తన రాజకీయం కోసం ఉద్యోగులను అడవుల పాల్జేశాడు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ చేరిపోతాడు. ఇప్పటికీ బాబు కుటుంబం హైదరాబాద్ లోనే నివాసం ఉంటోంది. బాబు కూడా ఎంచక్కా హైదరాబాద్ వచ్చేస్తాడు. ఉద్యోగులను మాత్రం ముప్పుతిప్పల పాల్జేశాడు. అదీ చంద్రబాబు విజన్.