Home రాజకీయాలు ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు..అక్కడా భూతర్పణమేనా!

ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు..అక్కడా భూతర్పణమేనా!

SHARE

అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన గీతమ్స్ విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియల కోసం ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించడం విమర్శల పాలవుతోంది. సాధారణంగా మరణం విషయంలో, మరణించిన వారి విషయంలో విమర్శలు చేయడానికి ఎవరైనా వెనుకాడతారు. అయితే ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం గీతమ్ మూర్తి అంత్యక్రియలను కూడా విమర్శలకు తావిచ్చేలా చేస్తోంది.

గీతమ్స్ అధినేత ఏమీ బికారి కాదు. ఆయన వందల కోట్ల రూపాయలకు అధిపతి. మాజీ ఎంపీ. ప్రస్తుత తెలుగుదేశం అధినేతకు బంధువు. బాలయ్యకు వియ్యంకుడు. ఇంత నేపథ్యం ఉంది. విశాఖతో సహా హైదరాబాద్, బెంగళూరుల్లో గీతమ్ విద్యాసంస్థలు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించాయి.

అలాంటి వ్యక్తి, వ్యాపార శక్తి అంత్యక్రియలను ప్రభుత్వ భూమిలో చేపట్టారు. అది కూడా ఆయన మరణించిన తర్వాత అప్పటికిప్పుడు భూమిని కేటాయించి.. అంత్యక్రియలను నిర్వహించారు. చంద్రబాబుకు బంధువు కాబట్టి.. అప్పటికప్పుడు భూ కేటాయింపులు జరిగిపోయాయి. ఇదీ కథ.

కొన్ని వందల ఎకరాల భూమిలో విద్యా వ్యాపారాన్ని చేసుకుంటున్న మూర్తి అంత్యక్రియలను ఆయన సొంత భూముల్లో నిర్వహించలేదు. ప్రభుత్వ భూమి కావాల్సి వచ్చింది. ఈ విషయంలో అటు మూర్తి కుటుంబం, చంద్రబాబు ప్రభుత్వం రెండూ విమర్శల పాలవుతున్నాయి. అధికారం ఉంది కాబట్టి.. ఇలా అయిన వారి అంత్యక్రియలకు కూడా ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నారు. ఇదీ చంద్రబాబు ప్రభుత్వ తీరు. ఈ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.