Home రాజకీయాలు జేసీ దివాకర్ రెడ్డికి పుండు మీద కారం..!

జేసీ దివాకర్ రెడ్డికి పుండు మీద కారం..!

SHARE

తెలుగుదేశం పార్టీలో చాలా అసహన భరితుడిగా ఉన్నాడు జేసీ దివాకర్ రెడ్డి. తన మాట చెల్లడం లేదని దివాకర్ రెడ్డి చాలా సార్లు వాపోయాడు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లా లో టీడీపీ తను చెప్పినట్టుగా వినకపోతే దారుణంగా ఓడిపోతుందని కూడా దివాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించాడు అనేక సార్లు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా తన కుమారుడికి సీటు ఇచ్చి.. ఈ ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ తను చెప్పిన వాళ్లనే అభ్యర్థులుగా పెట్టాలనేది దివాకర్ రెడ్డి డిమాండు.

ఆ డిమాండుకు అనుగుణంగా స్పందించడం లేదు చంద్రబాబు నాయుడు. అయితే జేసీ మాత్రం తను చెప్పినట్టుగా వినకపోతే అంతే సంగతులు అంటున్నాడు. తను చెప్పినట్టుగా వింటే.. అనంతలో టీడీపీకి 11 సీట్లు వస్తాయని, అలా కాకపోతే.. నాలుగైదు సీట్లు కూడా రావని జేసీ తేల్చి చెబుతున్నాడు. అయితే బాబు మాత్రం జేసీని పట్టించుకునేలా లేడు.

అందుకు నిదర్శనంగా మరో సంఘటన జరిగింది. ఈ సారి చంద్రబాబు నాయుడు జేసీ పుండు మీద కారం చల్లినట్టుగా వ్యవహరించాడు. ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రబోధానంద ఆశ్రమానికి జేసీకి రచ్చ రేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం తీవ్ర స్థాయికి చేరింది. జేసీ స్వయంగా రంగంలోకి దిగి అక్కడ రచ్చ చేశాడు. ఒకవేళ జేసీ ఎవరి మీద అయినా ఇలా రెచ్చిపోయి ఉంటే వాళ్ల కథ అంతటితో అయిపోయేది.

అయిదే దివాకర్ రెడ్డి ఈ సారి పెట్టుకున్నది కమ్మ బ్యాచ్‌తో. ప్రబోధానంద కమ్మ వ్యక్తి. అతడికి టీడీపీ నేతలతో మంచి పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రబోధానంద శిష్యులు చంద్రబాబు వద్దకు వెళ్లారు. జేసీపై వాళ్లు ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ గలుగుతున్నారు. జేసీకి డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే తమపై పోరాటం అంటున్నాడని వారు చెబుతున్నారు.

జేసీ ఇది వరకే చంద్రబాబును కలిసి ప్రబోధానంద పై ఫిర్యాదులు చేశాడు. అయినా బాబు ఇప్పుడు ప్రబోధానంద శిష్యులకు అపాయింట్ మెంట్ ఇచ్చాడు. కమ్మ సామాజికవర్గం కావడంతో ప్రబోధానంద ఇదంతా చేయగలుగుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఇది జేసీ పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది.