Home రాజకీయాలు కెఈ కుమారుడి పై అరెస్ట్ వారెంట్

కెఈ కుమారుడి పై అరెస్ట్ వారెంట్

SHARE

ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు కష్టాల్లో పడ్డారు. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసు కి సంబంధించి శ్యాంబాబు ఇంకా ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌ లను అరెస్ట్ చేయాలంటూ మరోసారి డోన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన డ్రైవర్‌ సాంబశివుడు హత్య కేసులో వీరిరువురిని నిందితులుగా చేర్చాలంటూ 2017లో నారాయణరెడ్డి భార్య శ్రీదేవి డోన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు కేఈ శ్యాంబాబు, నాగ తులసీ ప్రసాద్‌లను అరెస్ట్‌ చేయాలంటూ అప్పట్లోనే ఆదేశాలు జారీచేసింది.

అయితే డోన్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ శ్యాంబాబు హైకోర్టు కి వెళ్లడంతో అరెస్ట్ వారెంట్‌ పై స్టే తెచ్చుకోగలిగారు. స్టే గడువు ముగియడంతో డోన్ కోర్టు శ్యాంబాబు, ఎస్‌ఐ లను అరెస్ట్ చేయాలని మరోసారి ఆదేశించింది. అయితే ఈ సారి అరెస్టు చేయకపోతే పోరాటం కొనసాగిస్తామని శ్రీదేవి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.