Home రాజకీయాలు వ్యతిరేకుల ఓట్లను బాబు అలా తొలగింపజేస్తున్నాడా?

వ్యతిరేకుల ఓట్లను బాబు అలా తొలగింపజేస్తున్నాడా?

SHARE

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్ ఐవైఆర్ ఆసక్తిదాయకమైన విషయాన్ని చెప్పాడు. గత కొన్నాళ్లుగా ఏపీలో బాగా చర్చనీయాంశం అయిన ఓట్ల తొలగింపు అంశాన్ని ఐవైఆర్ ప్రస్తావించాడు. ఓట్ల తొలగింపుకు చంద్రబాబు ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోందని.. తమ వ్యతిరేకులు ఎవరో తెలుసుకోవడానికి జిత్తులు పన్నుతోందని ఐవైఆర్ అంటున్నాడు.

చంద్రబాబు పాలనపై సర్వేలు అంటూ కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. వీటిని ప్రభుత్వ ఖర్చుతోనే చేస్తున్నారు. తన పనితీరుపై బాబు ఈ ఫోన్ సర్వే ద్వారా ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాడు. ఇది పైకి అలా కనిపించే వ్యవహారమే అయినా.. ఈ సర్వేలో తమ పనితీరు పట్ల పెదవి విరుస్తూ ఫీడ్ బ్యాక్ ఇచ్చే నంబర్లను మాత్రం వేరు చేస్తున్నారట.

ఈ ఫోన్ నంబర్ల ద్వారా సదరు వ్యక్తుల డీటెయిల్స్ తీసుకుని.. వాళ్ల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్నే ఐవైఆర్ చెబుతున్నాడు. బాబు నుంచి వచ్చే నట్టుగా అనిపించే ఫోన్ కాల్స్ కు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారు ఓటర్ల జాబితాలో తమ పేరుందో లేదో సరి చూసుకోవాలని ఐవైఆర్ సూచిస్తున్నాడు.

ఇప్పటికే ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే యాభై అరవై వేల ఓట్లను కూడా తొలగించారు. తమకు పడవనే ఓట్లను చంద్రబాబు ప్రభుత్వం ఏదో సాకులు చెబుతూ తొలగిస్తోందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరికి వారు తమ ఓటు ఉందో లేదో చూసుకోవడమే మార్గం.