Home రాజకీయాలు విజయం.. కేసీఆర్‌కు నల్లేరు మీద నడక కాదా?!

విజయం.. కేసీఆర్‌కు నల్లేరు మీద నడక కాదా?!

SHARE

తెలంగాణలో విజయం ఎవరిది అవుతుంది? అంటే.. చాలా మంది కేసీఆర్ అనే అనేస్తారు. ప్రతిపక్షం మరీ వీక్‌గా ఉండటం ఈ అభిప్రాయానికి ప్రధాన కారణం. ఆ పై కేసీఆర్ విజయానికి కొన్ని రీజన్లను చెబుతారు. కేసీఆర్ కు మిగులు బడ్జెట్ ఉందని, సంక్షేమ పథకాలను బాగానే అమలు చేశాడని, అలాగే చెరువుల్లో పూడిక తీత వంటి పనులు కూడా ప్రజలకు నచ్చాయని.. అన్నింటికీ మించి కాంగ్రెస్ నుంచి అయినా తెలుగుదేశం నుంచి అయినా కేసీఆర్ కు ధీటైన నేతల లేడని.. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ విజయం సాధించవచ్చు అని అనే స్తారు.

ఇక మీడియా ప్రొజెక్షన్ కూడా దాదాపు ఇలానే ఉంది. అలాగే కేసీఆర్ నుంచి వ్యక్తం అవుతున్న ఆత్మ విశ్వాసానికీ లోటు లేదు. విజయం తమదే అనే అంశం గురించి కేసీఆర్ వ్యక్తం చేసే కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. వంద సీట్లను గెలుస్తాం అని కేసీఆర్ బల్ల గుద్ది చెబుతున్నాడు. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు.. తెరాస నేతలంతా ఇదే మాటే చెబుతున్నారు.

ప్రతిపక్షం ఇంకా ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నంలోనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ వైపు నుంచి వ్యక్తం అవుతున్న విశ్వాసాన్ని చూస్తే ఇక్కడ ఫలితాలు వన్ సైడెడ్ గా ఉంటాయేమో అని అనుకుంటున్నారంతా. అయితే.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉందని.. ఇక్కడ విజయం పట్ల కేసీఆర్ గట్టి విశ్వాసంతోనే ఉన్నా.. మరీ నల్లేరు మీద నడక మాత్రం కాదని పరిస్థితులను పరిశీలించిన వారు అంటున్నారు.

కేసీఆర్ చెబుతున్నంత ఈజీగానూ విజయం దక్కదు, ఆయన చెబుతున్నట్టుగా వంద సీట్లు కూడా రావు… పోటాపోటీగా ఉంటుంది అని తెలంగాణ గ్రౌండ్ లెవల్లో పరిస్థితులను గమనించిన వారు చెబుతున్నారు. అదీ కథ.