Home రాజకీయాలు లోకేష్ సర్పంచ్ గా కూడా గెలవలేడు: పవన్

లోకేష్ సర్పంచ్ గా కూడా గెలవలేడు: పవన్

SHARE

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్‌పై సెటైర్ లు వేశారు. అధికార తెలుగుదేశం పార్టీ పై మరోసారి విమర్శలు చేసిన పవన్ లోకేష్ కనీసం సర్పంచ్‌ గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు.

ఇక చింతమనేని పై తన విమర్శలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు పవన్. విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా అన్నారు పవన్. ఒకవేళ ప్రభుత్వానికి చింతమనేనిని తొలగించటం కష్టమైతే తామే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాస్తామన్నారు పవన్.

వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడం లేదని, అధికారంలోకి వస్తే జగన్‌ కు సంబంధించిన దోపిడీ వ్యవస్థను తీసుకురాబోమని స్పష్టం చేశారు. కేవలం జనసేన కు భయపడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని దుయ్యబట్టారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని పవన్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుంది అని ప్రభుత్వానికి భయం ఉందన్నారు. కౌలు రైతుల సమస్యలకై ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలని పవన్ అభిప్రాయపడ్డారు.