Home సినిమా అతిలోక సుందరిగా రకుల్‌..!

అతిలోక సుందరిగా రకుల్‌..!

SHARE

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలో తొలి భాగంలో ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్‌గా సుమంత్‌, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్‌, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ కనిపిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్‌తో సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి పాత్రకి రకుల్‌ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి శ్రీదేవి చాలానే సినిమాల్లో నటించింది కాబట్టి.. ఆమె పాత్రని ఈ మూవీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. శ్రీదేవి పాత్ర ఈ చిత్రంలో కీలకం కాబట్టి.. తొలుత కొంతమంది తారల్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కథానాయికల పేర్ల కూడా వినిపించాయి. కానీ.. చివరికి చిత్రబృందం రకుల్‌నే ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని రకుల్‌ అధికారికంగా ధృవీకరించారు. యన్‌.టి.ఆర్‌ నటించటంపై స్పందించిన రకుల్‌.. ప్రస్తుతం అందరి కళ్లు నామీదే ఉన్నాయి. అందుకే శ్రీదేవి పాత్రలో నటించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను కూడా ఆమె అభిమానినే. ఆమె పాత్రను వెండితెర మీద చూపించటం చాలా పెద్ద సాహసం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు.