Home రాజకీయాలు పవన్ మళ్ళీ సినిమాలా ??

పవన్ మళ్ళీ సినిమాలా ??

SHARE

పవర్ స్టార్ గా అభిమాన హారతులు అందుకొన్న పవన్ని కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశారు….2014 లోనే జన సేన అనే రాజకీయ పార్టీ ని. అప్పటి ఎలక్షన్స్ లో పోటీ పడుకున్నా….2019 లో ఖచ్చితంగా తమ పార్టీ అధికారం లోకి వస్తుందనే ధీమాతో వున్నారు. 2019 ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకునేందుకు అన్ని జిల్లాలో తిరుగుతూ కష్టపడుతున్నాడు. ప్రజల్లోకి వెళ్తూ పార్టీ విధివిధానాలు తీసుకెల్తూ పార్టీని గెలిపించ వలసిందని అభ్యర్థిస్తున్నారు.

ఇక ఆయన సినిమాలు చేయటం ఏమిటి? కానీ పవన్ మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారని సెన్సార్ బోర్డు‌ సభ్యుడు ఉమైర్ సాందూ చెప్పడం ఇప్పుడు రాజకీయ సీని వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ టైం లో తన రివ్యూలతో హుళచల్ చేసే సంధూ తన ట్వీట్ తో జనాలకి ఓ షాక్ ఇచ్చారు. ‘‘బ్రేకింగ్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బడ్జెట్ మూవీకి సైన్ చేశారు. అయితే, ఈ సినిమా షూటింగ్ 2019 ఎన్నికల తర్వాతే ప్రారంభం అవుతుంది’’ అని ట్వీట్ చేసాడు.

కొంతమంది అభిమానులు ఆనందపడితే కొంతమంది మాత్రం విస్మయం చెందారు…ఇంకొంతమంది కోపం తో ఊగిపోతున్నారు. పవన్ పూర్తిగా రాజకీయాల్లోనే కొనసాగుతారనే విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించి మళ్ళీ సినిమాల గోలేంటి అని అంటున్నారు. లో గుట్టు పెరుమాళ్ళకే ఎరుక!!