Home రాజకీయాలు ఏపీలో ఐటీ రైడ్స్ అంటే బాబు శివాలు: జగన్

ఏపీలో ఐటీ రైడ్స్ అంటే బాబు శివాలు: జగన్

SHARE

ఆంధ్రప్రదేశ్ లో ఐటి దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావుడి పై విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ స్పందించారు.

ఎక్కడ ఐటీ శాఖ అదికారులు తమ అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకుంటారో అని బాబు భయంతో వణికిపోతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు చీపురుపల్లి లో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజవర్గానికి రూ. 30 కోట్లు తరలించారని, ఆ వివరాలు ఎక్కడ లీకవుతాయోనని బాబు భయాందోళనలకు గురవుతున్నారని జగన్ తెలిపారు.

తమ పార్టీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యే లను సంతలో పశువుల మాదిరి కొన్నారని, ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని ఐటీ అధికారులు ప్రశ్నిస్తారని బాబు లో ఉలిక్కిపాటు ఉందని ధ్వజమెత్తారు. గతంలో అనేకమార్లు ఐటీ దాడులు జరిగినప్పటికీ స్పందించని బాబు ఇప్పుడెందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు.

నాలుగేళ్ల చంద్రబాబు పాలన లో రాష్ట్రాం లో అవినీతి పెరిగింది తప్ప ఇంకా ఏమీ జరగలేదని జగన్ ద్వజమెత్తారు.