Home రాజకీయాలు చేతులెత్తేశాడా? దేవినేని ఉమ.. ఉత్తర కుమారుడేనా!

చేతులెత్తేశాడా? దేవినేని ఉమ.. ఉత్తర కుమారుడేనా!

SHARE

ఉత్తరకుమార ప్రగల్భాలు పలకడంలో మంత్రి దేవినేని ఉమకు సాటి వచ్చే వారు లేరు. ఈయన ఏం మాట్లాడినా ఆ మాటల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రస్తావన తప్పనిసరి. గత పదేళ్లలో దేవినేని ఉమ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడిన సందర్భాలే ఉండవు. అంతలా జగన్ నామస్మరణ చేస్తూ ఉంటాడీయన. ఇక జగన్ కు బోలెడన్ని సవాళ్లు విసురుతూ ఉంటాడు. అవన్నీ ఉత్తరకుమారుడి మాటలే అనుకోండి.

మాటల సంగతలా ఉంటే.. దేవినేని ఉమ ఇప్పుడు ప్రత్యక్ష పోటీ విషయంలో కూడా చేతులు ఎత్తేశాడనే మాట వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ తను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నుంచి పోటీ చేయడానికి తటపటాయిస్తున్నాడని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమకు చుక్కలు చూపిస్తోంది. వసంత కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకుని మంత్రికి చెక్ పెట్టేశాడు వైసీపీ అధినేత జగన్.

ఈ నేపథ్యంలో అసలుకు వచ్చేసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికే దేవినేని ఉమ ఆలోచనలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. వేరే నియోజకవర్గం వేటలో పడ్డాడట ఈ మంత్రిగారు. మరోసారి మైలవరం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే అంచనాతో.. దేవినేని వేరే నియోజకవర్గాల వైపు చూస్తున్నాడని తెలుగుదేశం వర్గాలే చెబుతున్నాయి.

నూజివీడు నుంచి పోటీ చేయడమా లేక బాబును ప్రసన్నం చేసుకుని ఇంకా ఏదైనా సురక్షిత నియోజకవర్గాన్ని ఎంచుకోవడమా.. అనే ఆలోచనలో ఉన్నాడట ఈ మంత్రి. మాటలేమో కోటలు దాటేసేలా మాట్లాడే దేవినేని.. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో పోటీ చేయలేని స్థితిలో ఉన్నాడనమాట!