Home రాజకీయాలు బాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పంచ్!

బాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పంచ్!

SHARE

వ్యవస్థలను తనకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడిగా పేరుంది చంద్రబాబు నాయుడుకు. అయితే ఒక్కోసారి చంద్రబాబు ఇరుక్కొంటాడు. అప్పుడు ఆయనలోని విధ్వంసకారుడు బయటకు వస్తాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బంద్ లతో విధ్వంసాలు చేయించేవాడు. 2005లో ఫ్యాక్షనిస్టు, తెలుగుదేశం నేత పరిటాల రవి హత్య జరిగితే చంద్రబాబు నాయుడు తన వాళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాన్ని రేపాడు. కొన్ని వందల బస్సులను తగలబెట్టించాడు. వందల కోట్ల ప్రజా ధనాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లు ధ్వసం చేశారు.

ఇదీ చంద్రబాబు తీరు. తనకు ఇబ్బంది కలిగితే ఇలా బాబులోని విధ్వంసకారుడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఐటీ దాడుల సమయంలో కూడా అదే జరుగుతోంది. తన వాళ్లపై, తన వాళ్ల అక్రమాలపై ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటే చంద్రబాబు ఓర్వ లేకపోతున్నాడు. తన అక్కసును అంతా కక్కేస్తున్నాడు. ఇందులో భాగంగా ఏపీలో తనిఖీలు నిర్వహించే ఐటీ శాఖ అధికారులకు ఏపీ పోలీసుల నుంచి భద్రత కల్పించం.. అని చంద్రబాబు ప్రకటించాడు. తద్వారా ఐటీ శాఖ అధికారులపై ఎదురుదాడి చేయడానికి, వాళ్లపై రౌడీ మూకలను రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించినట్టుగా ఉన్నాడు.

ఇలా చంద్రబాబులోని విధ్వంసకారుడు మరోసారి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ బాబు తీరును తప్పు పట్టాడు. ఐటీ శాఖ అధికారుల తనిఖీలకు భద్రత కల్పించం అని రాష్ట్ర ప్రభుత్వాలు అనడం సరి కాదని ఆయన అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ, సీబీఐ అధికారులకు రక్షణ కల్పించకపోతే కేంద్ర బలగాలు దిగుతాయని లక్ష్మినారాయణ అన్నాడు.

సీఆర్పీఎఫ్, ఆర్మీలను రక్షణగా పిలుచుకుని ఐటీ, సీబీఐ తనిఖీలు సాగుతాయని ఈ సీబీఐ మాజీ జేడీ అన్నాడు. తన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చని అనుకుంటున్న బాబుకు గట్టి పంచ్ ఇది.