Home రాజకీయాలు భాజపా కి సర్వే షాక్….మూడు రాష్ట్రాల్లో అధికారం….!!

భాజపా కి సర్వే షాక్….మూడు రాష్ట్రాల్లో అధికారం….!!

SHARE

నిన్న ఎన్నికల కమిషన్‌ ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పోతే మూడు రాష్ట్రాల్లో ఏబీపీ న్యూస్‌-సీ వోటర్‌ సర్వే చేసింది. సర్వే వివరాల ప్రకారం బీజేపీ కి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ మూడు రాష్ట్రాల లో గడ్డుపరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది అని తెలిపింది. ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే ప్రకారం రాజస్థాన్‌ కాంగ్రెస్ కైవసం కానుంది ఇక 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నే అధికారం చేజిక్కించుకోనుంది.

ఇప్పటి కిప్పుడు రాజస్థాన్‌లో కానక ఎన్నికలు జరిగినట్టవుతే 200 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీకి 142, బీజేపీకి 56 సీట్లు దక్కుతాయని సర్వే వెల్లడించింది. మధ్యప్రదేశ్‌ లో 230 సీట్లలో కాంగ్రెస్‌కి 122 సీట్లు దక్కుతాయని, భాజపాకి 108 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కి 47, భాజపాకి 40 సీట్లు వస్తాయి.

అయితే భాజపా నేతలు ఈ సర్వే ని కొట్టిపారేశారు….మూడు రాష్ట్రాల్లో తమదే విజయమని ఘంటాపధంగా చెప్తున్నారు. ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే ఎప్పుడూ కూడా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మరి ఈ సారి కూడా అదే జరగొచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.