Home సినిమా రాజేంద్రుడికి మకిలి అంటించిన శ్రీ రెడ్డి

రాజేంద్రుడికి మకిలి అంటించిన శ్రీ రెడ్డి

SHARE

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విపరీతం అంటూ ఆరోపణలు మొదలు పెట్టిన నటీమణి శ్రీ రెడ్డి ఎంతో మంది పేర్లను కాస్టింగ్ కౌచ్ తో ముడిపెట్టి బయటపెట్టింది….దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరాం, గాయకుడూ శ్రీరామచంద్ర, నాని, శేఖర్ కమ్ముల మొదలగు వారికి నిద్ర కరువయ్యేలా చేసిన శ్రీ రెడ్డి తాజాగా రాజేంద్రుడిని కూడా ఈ మురికి లోకి లాగింది.

తన పేస్ బుక్ పోస్ట్ లో శ్రీ రెడ్డి నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూడా నటీమణులని సెక్స్ కోసం వేధించేవాడని ఆరోపించింది.మాళవిక కూడా ఇందుకే ఇండస్ట్రీ విడిచిపెట్టింది ఆరోపించింది. అన్నట్టు మాళవిక అప్పారావు డ్రైవింగ్ స్కూల్ షూటింగ్ టైం లో రాజేంద్ర ప్రసాద్ తో షూటింగ్ తన వాళ్ళ కాదని చెప్పటం మనకి తెలిసిందే.

ఇంకొంచం ముందుకెళ్లి రాజేంద్ర ప్రసాద్ కూతురు ఇల్లు విడిచిపెట్టటానికి గల కారణం కూడా అందరికీ తెలుసనీ అంది. అతని కూతురు వయసున్న తనని రాజేంద్రప్రసాద్ మరోలా భావించాడని అంది. అతని బండారం త్వరలో బయటపెడతా అంటూ వార్నింగ్ ఇచ్చింది

ఇక శ్రీ రెడ్డి రెడ్డి డైరీ అని తన బయోపిక్ సినిమా చేస్తోంది…హీరోయిన్ కావాలనే కలలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే సామాన్య ఆడదానికి ఎదురయ్యే కష్టాల నేపథ్యంలో ఈ సినిమా వుండబోతోంది.