Home సినిమా బాబాయ్ ని వాడుకుంటున్న చరణ్

బాబాయ్ ని వాడుకుంటున్న చరణ్

SHARE

మెగా పవర్ స్టార్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. చరణ్ డిఫరెంట్ లుక్ తో కనిపించే ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని నటిస్తోంది.

ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ మధ్య కాలంలో చిరు సినిమా టైటిల్ ‘స్టేట్ రౌడీ’ అని కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయి ఉండటం వలన, అందరిలో ఈ టైటిల్ పై ఆసక్తి పెరిగింది. స్టేట్ రౌడీ పవర్ఫుల్ గా ఉంటుందని భావిస్తూ వస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘తమ్ముడు’ అనే టైటిల్ ను చిత్ర సమర్పకులు పరిశీలిస్తున్నారట. ఈ సినిమాలో ప్రశాంత్ .. ఆర్యన్ రాజేశ్ లకి తమ్ముడిగా చరణ్ కనిపించనున్నాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు వున్నట్టు వార్త. అప్పట్లో పవన్ కల్యాణ్ కెరియర్లో ‘తమ్ముడు’ ఓ మంచి చిత్రం గా నిలిచి౦ది. బాబాయ్ పవన్ కి ఉన్న క్రేజ్ కూడా చరణ్ కి కలిసొస్తున్నదని భావించి ఈ టైటిల్ ను అనుకుంటూ ఉండవచ్చు. ఏమైనా విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.