Home ప్రత్యేకం వైఎస్సార్సీపీ.. ఈ సర్వేలను లైట్ తీసుకోవాల్సిందే!

వైఎస్సార్సీపీ.. ఈ సర్వేలను లైట్ తీసుకోవాల్సిందే!

SHARE

రానున్న  సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం తప్పదని జాతీయ మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి. తెలుగుదేశం జాతి మీడియా ఇంకా బాబుకు భజన చేయడంలోనే బిజీగా ఉంటే.. జాతీయ మీడియా మాత్రం బాబుకు దారుణ పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే అధికారాన్ని అందుకోవాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారాన్ని అందుకోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సర్వేలు కేవలం ఉత్సాహాన్ని ఇచ్చేవిగా భావించాలి కానీ, అతి విశ్వాసానికి ఇవి కారణం కారాదు అని వైసీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బ తింది? అంటే దానికి ఒకటే సమాధానం. అతి విశ్వాసానికి పోయి. ఇక గెలిచేస్తున్నాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు గట్టిగా నమ్మాయి. అదే అదునుగా ప్రత్యర్థులు గుంపుగా వస్తున్న విషయాన్ని కూడా వైసీపీ వర్గాలు తేలికగా తీసుకున్నాయి.

గత ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య చాలానే ఉంది. ఇలాంటి నియోజకవర్గాలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. అతి విశ్వాసానికి లోనై.. వైసీపీ అభ్యర్థులు, శ్రేణులు సరిగా పని చేయడమే మానేశారు. ఇక ఎలాగూ గెలిచేస్తున్నాం కదా.. ఎందుకు అనవసరంగా కష్టపడాలన్నట్టుగా వారు వ్యవహరించారు.

ఇక ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తీవ్రమైన వ్యతిరేకతను పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు సర్వేలు వైసీపీకే పట్టం కడుతున్నాయి. అయితే ఈ సర్వేలను వైసీపీ ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది. విజయం సాధించాల్సింది సర్వేల్లో కాదు.. ఎన్నికల ఫలితాల్లో అనే విషయాన్ని గ్రహించి వైసీపీ శ్రేణులు పని చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక ఎలాగూ రేపు చంద్రబాబు అనుకూల మీడియా మళ్లీ మొదలుపెడుతుంది. చంద్రబాబు గెలిచేస్తున్నాడని సర్వేలను ఇచ్చినా ఇవ్వగలదు. కాబట్టి.. వైసీపీ సర్వేలను పక్కన పెట్టి.. క్షేత్ర స్థాయిలో పని చేసుకుని విజయం దిశగా అడుగులు వేసుకుంటే ఆ పార్టీకే మంచిది.