Home రాజకీయాలు గంటా కు బాబు భయపడుతున్నారా?

గంటా కు బాబు భయపడుతున్నారా?

SHARE

విశాఖపట్నంలో గత నాలుగు సంవత్సరాలుగా చోటు చేసు కుంటున్న భూ కుంభకోణాలపై సిట్ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట పెట్టక పోవడానికి గల కారణం ఏమిటని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు.

ఈ భూ కుంభకోణంలో అధికార పార్టీ కి చెందిన అనేక మంది నేతలు మంత్రులు కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇందులో కీలకం అన్న రామకృష్ణ…. చంద్రబాబు గంటాకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు.

దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై కూడా స్పందిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్ కుంభకోణంపై ఈనెల 24న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన రామకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.