Home రాజకీయాలు లోకేష్ ట్వీట్.. పేలుతున్న సెటైర్లు!

లోకేష్ ట్వీట్.. పేలుతున్న సెటైర్లు!

SHARE

ఇన్నాళ్లూ లోకేష్ మాటల్లో వీకు, ట్విట్టర్లో చాకు అనుకుంటుంటే.. ఇప్పుడు ట్విటర్లోనూ ట్రోల్ పాలయ్యాడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ బొమ్మ పక్కన కళాత్మకంగా నెలవంక కనిపించేలా తీసిన ఒక ఫొటోను పోస్టు చేస్తూ లోకేష్ కవితాత్మకంగా ఒక ట్వీట్ పెట్టాడు.

‘‘నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం.’’ అంటూ ట్వీట్ చేశాడు లోకేష్. అయితే ఇక్కడే లోకేష్ సహజంగా ‘పప్పు’లో కాలేశాడు.

ఎన్టీఆర్ విగ్రహం ఫొటో ఒకటి పోస్టు చేస్తూ.. నారా లోకేష్ పెట్టిన ట్వీట్ కు తీవ్రమైన సెటైర్లే కనిపిస్తున్నాయి. తనేదో కనుగొన్నా అన్నట్టుగా లోకేష్ బాబు ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే చంద్రుడు కనిపించేలా తీసిన ఫొటోను పోస్టు చేస్తూ లోకేష్ ఒక ట్వీట్ పెట్టాడు. ‘‘నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం…’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు. దీనికి బ్రహ్మాండమైన స్పందన వస్తుందని లోకేష్ లెక్కేసినట్టుగా ఉన్నాడు.

అయితే లోకేష్ పై సెటైర్లే రీ ట్వీట్లు అయ్యాయి. అనేక మంది నెటిజన్లు లోకేష్ ను ట్రోల్ చేస్తున్నారు. ‘ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్న గారు చెప్పారు..’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.

‘90 శాతం చందమామ సమయం అయిపోయింది.. ఇక మిగిలింది పది శాతం మాత్రమే.. తెలుగు ప్రజలకు స్వర్ణయుగం ముందుంది అని అన్నగారు చెబుతున్నారు..’ అని మరో ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు.

‘ మొన్న నే గా పౌర్ణమి వెళ్లిపోయింది., ఇంక వచ్చేది అమావస్యే !! అంటే అన్నగారు కూడా symbolic గా మీకు తిరోగమనం స్టార్ట్ అయింది అని మీకు చెబుతున్నట్టు వుంది. అయ్యా పోస్ట్ పెట్టే ముందు చూస్కోవాలి కదా??!!😂😉’ అంటూ మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు.

ఈ విధమైన రెస్పాన్స్ వచ్చింది లోకేష్ బాబు ట్వీట్ కు. ఏదో గొప్పగా చెప్పాలని లోకేష్ ప్రయత్నించాడు కానీ.. అది అడ్డం తిరిగి ట్రోల్ తప్పడం లేదు.