Home వీడియోలు ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ పివోట్‌ టీజర్‌

‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ పివోట్‌ టీజర్‌

SHARE

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పివోట్‌ టీజర్‌ పేరిట ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ ఈ చిత్రంలో చేస్తున్న మూడు క్యారెక్టర్లను పరిచయం చేశారు.

అమర్‌ కాషాయ రంగు దుస్తుల్లో దిగాలుగా ఓ మూలకు కూర్చుని చూస్తుంటే, అక్బర్‌ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్‌ టీషర్ట్‌ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా మూడు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.