Home సినిమా రాంకీ కూడా అలాంటోడేనా??

రాంకీ కూడా అలాంటోడేనా??

SHARE

టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖుల పై సంచలన ఆరోపణ లతో శ్రీరెడ్డి ఒక సెలబ్రిటి అయిపొయింది….తన ఆరోపణ అస్త్రాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ, తెలుగు సినీ ప్రముఖులని టార్గెట్ చేస్తూ కాస్టింగ్ కౌచ్ విషయం లో శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీ పై సంచలన ఆరోపణలు చేసింది. అతడి తో జరిగిన చాటింగ్ మెసేజ్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రాంకీ ని ఇరకాటంలో నెట్టింది.

ఇకపోతే, రాంకీ ముందునుంచీ శ్రీరెడ్డి వ్యతిరేకి గానే కనపడ్డాడు. విచిత్రంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం లో కూడా పలు టీవీ టాక్ షో లలో రాంకీ పాల్గొన్న సంగతి మనకి తెలిసిందే. తాజగా సోషల్ మీడియాలో రాంకీపై శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. చాటింగ్ మెసేజీ లు పోస్ట్ చేస్తూ.. ఏవండీ రాంకీ గారు.. మాటలు చెప్పడం వరకేనా పాటించేది ఉందా అంటూ ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం ప్రతి వ్యవహారంలోకి రెక్కలు కట్టుకుని వాలిపోతాడ౦టూ శ్రీరెడ్డి విమర్శలు చేసింది.

పవన్ కళ్యాణ్ ని కూడా ఇందులోకి లాగి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. …”ఒరేయ్ పీకే చెంచా.. పీకేని చూసి నువ్వు కూడా బాగా నేర్చుకున్నావు. హాస్పిటల్ ల్యాబ్ ఇంచార్జ్ గా ఉంటూ ప్రొడ్యూసర్ ఎలా అయ్యావు అంటూ ప్రశ్నించింది. తాట తీస్తాను ఎదవా ..అని ఘాటు వార్నింగ్ ఇచ్చింది.