Home రాజకీయాలు కెసిఆర్ తరహాలో ఏపీ లో జర్నలిస్టులకు జగన్ భరోసా

కెసిఆర్ తరహాలో ఏపీ లో జర్నలిస్టులకు జగన్ భరోసా

SHARE

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖ జిల్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు భీమిలి లోని గండిగండం క్రాస్ వద్ద జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర లో జగన్ ని చూడటానికి, బాధలు సమస్యలు చెప్పుకోవటానికి అనేక మంది ప్రజలు వచ్చారు.

ఈ నేపథ్యం లో జగన్ ఏపీ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధు లతో సమావేశమయ్యారు. వారు తమ సమస్యలు తెలియజేస్తూ జగన్ కి వినతిపత్రం ఇచ్చారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ గురించి విజ్ఞప్తి చేశారు. అలానే ఒక జర్నలిస్టు ఏదైనా అనివార్య కారణం చేత చనిపోతే వారి కుంటుంబ సభ్యులకు నెలకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత పెన్షన్‌ పై నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు అయితే జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తానిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పారు.