Home రాజకీయాలు మాయదారి బాక్సయిట్ ఎమ్మెల్యే ల ప్రాణాలు తీసిందా

మాయదారి బాక్సయిట్ ఎమ్మెల్యే ల ప్రాణాలు తీసిందా

SHARE

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను మావోయిస్టులు ఈ రోజు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. నిమిటిపుట్టిలో గ్రామదర్శిని కార్యక్రమానికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెళ్తుండగా సుమారు 60 మంది వరకు మావోయిస్టులు ఇద్దరి నీ చుట్టుముట్టి తర్వాత సుమారు 20 నిమిషాలు వారితో సమావేశం పెట్టి మరీ హత్య చేశారు.

నల్ల క్వారీలు నడపడం వల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లను మావోలు టార్గెట్ చేశారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన రోజు నించి విశాఖ ఏజెన్సీ లో బాక్సైట్ తవ్వకాల పై రగడ నడుస్తోంది.

2015లో బాక్సైట్ తవ్వకాల పై ఏజెన్సీ లో వివాద౦ చెలరేగింది. బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలంటూ ఆదివాసీ లతో పాటు మావోలు డిమాండ్ చేశారు. అంతేకాదు 2015 అక్టోబర్ 6న మావోలు తెదేపా నేత లను కిడ్నాప్ చేశారు. బాక్సైట్ త‌వ్వ‌కాల‌ను ర‌ద్దు చేయ‌ని యెడల త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రికాలు జారీచేశారు కూడా…

గిరిజనులతో నిరసన చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. జీవో ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కిడ్నాప్ చేసిన టీడీపీ నేతలను ఒడిశా లో చిత్రకొండ అటవీప్రాంతంలో అప్పగించారు.

అయితే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలు క్వారీ నడపడం లోదిట్టలనే ప్రచారం ఉంది. హుకుంపేటలోని క్వారీ సర్వేశ్వరరావు బావమరిది పేరుమీద ఉన్నట్టు సమాచారం ఈ క్వారీ వల్ల తమ కు నష్టం ఔతోందని గిరిజనలు ఆందోళన చేపట్టారు.

మైనింగ్, భూకుంభకోణాలు, అక్రమ మైనింగ్ గురించి వైకాపా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూనే వుంది …అయినా పెడచెవిన పెట్టిన ఎమ్మెల్యే లను మావోలు కాల్చి చంపారు.