Home వీడియోలు అరవింద సమేత: పెనివిటి సాంగుకు సూపర్ రెస్పాన్స్

అరవింద సమేత: పెనివిటి సాంగుకు సూపర్ రెస్పాన్స్

SHARE

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రానికి సంబంధించి ‘పెనివిటి’ సాంగుకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ లిరికల్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోపే 2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేయగా.. కాల భైరవ పాడారు. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

‘అరవింద్ సమేత’ చిత్రానని హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జగపతిబాబుతో పాటు నాగబాబులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.