Home సినిమా కోహ్లీ పోస్టు కి అర్ధం ఏమిటో…!!

కోహ్లీ పోస్టు కి అర్ధం ఏమిటో…!!

SHARE

కోహ్లీ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడా? భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ యాక్టింగ్ రంగంలో ప్రవేశిస్తున్నాడా…మైదానాన్ని ఎలా ఐతే సొంతం చేసుకున్నాడో బాలీవుడ్ ని కూడా సొంతం చేసుకోబోతున్నాడా అంటే అవున నే సమాధానం వస్తోంది. కారణం కోహ్లీ తన ట్విటర్ ఖాతాలో పెట్టిన తాజా పోస్టు. ఈ వాదనకు బలం చేకూరేలా వుంది ఆ పోస్టు. కోహ్లీ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఏషియకప్‌కు దూరంగా ఉన్నాడు…సో కోహ్లీ సినిమా చిత్రీకరణ లో ఉన్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ట్విటర్లో షేర్ చేసిన పోస్టరు పై ‘ఇంట్రడ్యూసింగ్ విరాట్ కోహ్లి.. ద మూవీ‌ ’అని రాసి ఉంది. పోస్ట్‌లో ‘పదేళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా వస్తున్నాను. వెయిట్ చేయలేకపోతున్నాను’ అ౦టు కామెంట్ చేశాడు కోహ్లీ. ఇది విరాట్ ఫాన్స్ కి పండగే. కోహ్లీ భార్య అనుష్క సినిమాల్లో బిజీగా వున్నారు…ఇద్దరూ కలిసి నటిస్తే ఇంకా బాగుటుందని వారి అభిప్రాయం!!