Home రాజకీయాలు నోటుకు ఓటు కేసు – బాబు పై బిగిస్తున్న ఈడీ ఉచ్చు

నోటుకు ఓటు కేసు – బాబు పై బిగిస్తున్న ఈడీ ఉచ్చు

SHARE

బాబు కి కష్టాలు మొదలయ్యాయా అంటే ఔననే అంటున్నాయి మీడియా వర్గాలు. ఓటుకు నోటు కేసులో ఈడీ రంగంలోకి దిగబోతోంది అన్న వార్తే అందుకు సాక్ష్యం. ఆ కేసులో ఐదు కోట్ల పై నిగ్గు తేల్చాలంటూ ఈడీ తో సహా కేంద్ర సంస్థ లకు పోలీసు ఉన్నతాధికారుల లేఖ వెళ్లడం షాక్ గొలిపే అంశమే

ఓ పక్క తెలంగాణ ముందస్తు ఎన్నికలకు రెడీ అంటున్న సందర్భం లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పై తెలంగాణ పోలీసు వర్గాలు వార్త ప్రకారం ఓటుకు నోటు కేసు లో బాబు పై ఉచ్చుబిగుస్తున్నదని …ఆ నాడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధి కి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్ల రూపాయ లు ముడుపులు ఇస్తామని బాబు స్వయంగా చెప్పటం ఆడియో టేపులలో తెలిసిందే. అందులో భాగంగా 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా స్టీఫెన్సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ఈ డీల్ లో దొరికిన ఐదు కోట్ల రూపాయలు ఎవరివి ….ఎక్కడ నుంచి వచ్చాయి….మిగతా 4.5 కోట్ల రూపాయలు మాట ఏమిటి అన్నది తేల్చటానికి ఈడీ రంగంలోకి దూకానుంది. అది కూడా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తో పాటు కేంద్ర సంస్థ లను కోరుతూ లేఖ రాయటం వల్ల జరుగుతున్నడెవలప్మెంట్. అయితే ఈడీ ఒక్కటేనా లేక వేరే విచారణ ఏజెన్సీ లు కూడా వస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఏది ఏమైనా ఈ వ్యవహారం బాబుకి కొత్త సమస్యలు సృష్టించే అవకాశం వుంది. విషయం తెలిసే రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ లు ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేయించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చి దగ్గర దగ్గరగా మూడున్నర సంవత్సరాలౌతున్నాకేసులో పెద్దగా పురోగతి లేదు. కానీ ఉన్నట్టు౦డి ఈడీతోపాటు మరికొన్ని కేంద్ర ఏజెన్సీలకు తెలంగాణ పోలీసు అధికారులు లేఖ రాయటం ఏమిటో…దీని వెనక రాజకీయ కోణం ఉండొచ్చేమో అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.