Home రాజకీయాలు బాబు సెక్షన్ 8ని దుర్వినియోగం చేస్తున్నారని కెసిఆర్ గుర్రు

బాబు సెక్షన్ 8ని దుర్వినియోగం చేస్తున్నారని కెసిఆర్ గుర్రు

SHARE

ఇంతకు మునుపు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు జరగడంలేదని గవర్నర్ నరసింహన్ పై తెదేపా నేతల కంప్లైంట్ లు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సెక్షన్ 8 ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని కంప్లైంట్ అట. ఇక దీనిపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట.

అన్ని డిపార్ట్మెంట్ లు ఖాళీ చేసేసి అమరావతి వెళ్లిపోయాక ఇప్పుడు మళ్ళీ పోలీస్ నిఘా విభాగాన్ని హైదరాబాద్ కి రప్పించి చంద్రబాబు తెలంగాణ లో సర్వేలు చేయిస్తున్నారని ఆరోపణ. దీనిపై కెసిఆర్ గుర్రుగా ఉన్నారు. అంతేకాక టిఆర్ఎస్ నేతలను ఆకర్షించడానికి కూడా బాబు ఈ నిఘా సిబ్బందిని వాడుకుంటున్నారని, జిల్లాల వారి టిఆర్ఎస్ నేతలు కెసిఆర్ కి తెలిపారు.

కెసిఆర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. బాబు టిడిపి కోసం, ఇతర పార్టీల కోసం తెలంగాణలో నిఘా సిబ్బందిని వాడుతున్న వైనం గవర్నర్కు పిర్యాదు చేయాలని కెసిఆర్ అనుకుంటున్నారట.