Home రాజకీయాలు సోమయాజులు కమిషన్ నివేదిక-జగన్ ట్విట్టర్ స్పందన

సోమయాజులు కమిషన్ నివేదిక-జగన్ ట్విట్టర్ స్పందన

SHARE

గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో ఇరవైతొమ్మిది మంది మరణించిన ఘటన పై విచారణకు ప్రభుత్వం సోమయాజులు కమిషన్ ను నియమించింది…కమిషన్ ఇచ్చిన నివేదికపై విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

బాబు చేసిన నిర్వాకం వల్ల పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోతే దేవుడ్ని, ప్రజలను క్షమించమని అడగాల్సిందిపోయి కమిషన్‌తో తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారని జగన్ అన్నారు. బాబు చేతిలో ఉన్న కమిషన్‌ తో తప్పుడు నివేదిక ఇప్పించుకుని భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారని జగన్‌ పేర్కొన్నారు.

పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే.. దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవడం మరో తప్పని ఆయన వ్యాఖ్యానించారు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పుల మీద తప్పులు చేశారని.. చంద్రబాబు చర్యల వల్లనే అంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.