Home రాజకీయాలు నాట్లేసి నిరసన వ్యక్తం చేసిన ఎం ఎల్ ఏ రోజా

నాట్లేసి నిరసన వ్యక్తం చేసిన ఎం ఎల్ ఏ రోజా

SHARE

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అధ్వాన స్థితి పై విపక్ష వైఎస్సార్సీపీ వినూత్నంగా నిరసన తెలియజేసింది. చిత్తూరు జిల్లా నగరి లో ఘోరంగా దెబ్బతిన్న రోడ్ల పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే నిరసన ప్రజలని ఆకట్టుకుంది. రోజా కొంత మంది స్త్రీ లతో కలిసి రోడ్లపై నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెప్పడంతో రోజా ఈ రోజు మేళపట్టు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ బురద మయంగా మారిన రోడ్లపైనే నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా అధికార పార్టీ పై రోజా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేత, జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులో రోడ్ల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక రాష్ట్రపరిస్థితి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోడ్లన్నీఅధ్వానంగా ఉంటే….మంత్రి లోకేశ్ లక్షల కిలోమీటర్లు రోడ్లు వేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

గ్రామాలకి వచ్చి ప్రజల సమస్యలు వినే ధైర్యం ముఖ్యమంత్రి కి కానీ ఆయన నాయకత్వంలోని తెదేపా నేతలకి కానీ ఎవరికీ లేదన్నారు. జిల్లాపరిషత్ సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించినా కూడా పట్టించుకోలేదన్నారు.