Home రాజకీయాలు 500రూ తో పోయే కేసుకి బాబు సింపతీ ప్రాపగాండా

500రూ తో పోయే కేసుకి బాబు సింపతీ ప్రాపగాండా

SHARE

హీరో శివాజీతో డ్రామా ఆడించింది తెదేపా నాయకులే….ఇక వారు తమ డ్రామాలు ప్రజలకు తెలియద అని అనుకోవడం మూర్ఖత్వం. అరెస్టు వారెంట్‌ విషయం వారం రోజుల ముందు శివాజీ కి ఎలా తెలసు? తెదేపా వారు ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరూ కూడా వారి మాటలు నమ్మే పరిస్థితి లో లేరు అని తెలుసుకోవాలి అని బీజేపీ ఎం ఎల్ ఏ విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

బాబ్లీ కేసు లో వచ్చిన అరెస్ట్ వారెంట్ ను తెదేపా వారు అనవసర రాద్ధాంతంగా చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇది కేవలం 500 రూపాయల తో పోయే ఓ చిన్న కేసని….అలాంటి కేసు పట్టుకుని ఏదో జరిగిపోతున్నట్టుగా టీడీపీ ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాభం కోసమే టీడీపీ ఈ నోటీసుల డ్రామా మొదలెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎటువంటి సానుభూతీ రాదని అభిప్రాయపడ్డారు. కోర్టు నోటీసులు వస్తే… ప్రధాని మోదీ ఇదంతా చేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయిస్తుండడం హాస్యాస్పదమని అన్నారు.

ఆశలు బాబుకు నోటీసులు వస్తాయని శివాజీకి వారం రోజుల ముందే ఎలా తెలుసని విష్ణు ప్రశ్నించారు.