Home రాజకీయాలు “పవన్ కి ఘోర పరాభవం తధ్యం”

“పవన్ కి ఘోర పరాభవం తధ్యం”

SHARE

సైదాబాద్ లో జరిగిన ఓ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయిన నటి శ్రీ రెడ్డి ని మీడియా ప్రశ్నించింది. ఆమె రాజకీయ అరంగేట్రం పై వస్తున్నారూమర్ల గురించి ఆమెని ప్రశ్నించాయి.

“మీరు రాజకీయాలలోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నది నిజమేనా’ అన్న ప్రశ్నకు సమాధానంగా…తనను ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. అయితే తనకి మాత్రం రాజకీయాల పై ఇప్పుడు ఎటువంటి ఆసక్తి లేదని….సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు ప్రచారం అన్నీ కూడా అవాస్తవమని కొట్టి పడేసారు.

పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టి సెన్సేషన్ అయినా శ్రీ రెడ్డి వద్ద పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించగా రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘోర పరాభవం చవి చూస్తాడని….అతని పార్టీ, జన సేన కేవలం మూడు నాలుగు సీట్లకే పరిమితం కావచ్చని శ్రీ రెడ్డి జోస్యం చెప్పారు.