Home రాజకీయాలు “బీజేపీ వల్ల అచ్చేదిన్…? చచ్చేదిన్”

“బీజేపీ వల్ల అచ్చేదిన్…? చచ్చేదిన్”

SHARE

బిజెపి అద్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చి పార్టీ తరఫున ఎన్నికల శంఖారావం పూరించిన విషయం విదితమే. అంతే కాదు షా కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కూడా…ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని తప్పు బట్టారు. ఇంకా కెసిఆర్ పాలన చూస్తుంటే తెరాస పార్టీ తిరిగి అధికారం లోకి వస్తున్నాడని ఏ మాత్రం నమ్మడం లేదని అన్నారు.

షా విమర్శలు తిప్పికొట్టడానికి తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కెటిఆర్ స్పందించారు. బిజెపి పాలన లో ఎవరికీ అచ్చేదిన్ రాలేదని, వచ్చిందల్లా చచ్చేదిన్ మాత్రమే అని ఆయన ఎద్దేవా చేశారు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా ను కేటీఆర్ భ్రమిత్ షా గా అబివర్ణించారు. భాజపా పాలనలో బ్యాంకులకు పోదామంటే ప్రజలకు భయమేస్తోంది అన్నారు.

ఇంకా బీజేపీ అధ్యక్షునికి మతిమరుపు కూడా వచ్చిందని, 2002లో ప్రధాని మోదీ గుజరాత్‌లో, 2004లో దివంగత నేత వాజ్‌పేయ్‌ కూడా ముందస్తు కు వెళ్లారని గుర్తు చేశారు. ఇన్నీ మరిచిపోయి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని అడగటం విడ్డూరమని ఆయన ద్వజమెత్తారు. కోసం మెరుపుగా తెలంగాణ లో ద్విముఖ పోటీ ఉంటుంది అని అది కాంగ్రెస్‌తోనే అని స్పష్టం చేశారు.