Home సినిమా అయ్యో మహర్షికి ఈ కష్టాలేంటో…!!

అయ్యో మహర్షికి ఈ కష్టాలేంటో…!!

SHARE

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ బాబు 25 చిత్రంగా నిర్మితమౌతున్నచిత్రం ‘మహర్షి.’ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నా అప్పుడెప్పుడోనే చిత్ర యూనిట్ అమెరికా షెడ్యూల్ కి ప్లాన్ చేసుకుని వుంది. అయితే వీసా కష్టాల వాళ్ళ ఆలస్యమౌతూ వస్తోంది.
ఇక నేడో రేపో వీసాలు క్లియర్ అవుతాయి అనుకుంటున్న సమయంలో అనుకోని ఆటంకం ఎదురైంది. ఇరవై అయిదు రోజుల షూటింగ్ షెడ్యూల్ అమెరికా లో ప్లాను చేసుకొన్న యూనిట్ వీసా కారణాల వల్లే షెడ్యూల్ర ని ద్దు చేయడం జరిగింది.

తిరిగి అక్టోబర్ నెలలో మరో మారు ప్రయత్నించి ఈ షెడ్యుల్ గట్టెంకించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని సమాచారం. రెండు షెడ్యుల్ లను డెహ్రాడూన్ లో పూర్తి చేశారు. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.