Home రాజకీయాలు “బాబుకి నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవటమే తెల్సు!!”

“బాబుకి నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవటమే తెల్సు!!”

SHARE

పోలవరం ప్రాజెక్టు పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కాంగ్రెస్ సీనియర్ ఎమ్ పి కెవిపి రామచంద్రరావు నలభై మూడు ప్రశ్నలు సంధించారు. పోలవరం వైస్సార్ కృషే అని అన్న ఆయన కేవలం చంద్రబాబు వల్లే పోలవరం జాప్యం అయిందని కూడా కేవీపీ ఆరోపించారు.

గతంలో వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అన్ని అనుమతులు సాదించి, కాల్వల తవ్వకం చేపట్టింది వైఎస్ కాదా అని కూడా కేవీపీ ప్రశ్నించారు.

ఇదివరకు చంద్రబాబు పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కేవీపీ అన్నారు. అసాలు బాబు తన హయాం లో నీటి పారుదల ప్రాజెక్టు లను అడ్డుకోవడానికి ఎంతో ప్రయత్నించారని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ,దేవినేని ఉమా లు ధర్నాలు చేశారని కూడా ఆయన గుర్తు చేశారు.