Home సినిమా అనగనగనగా అరవింద…అబ్బ ఎంత బావుందో!!

అనగనగనగా అరవింద…అబ్బ ఎంత బావుందో!!

SHARE

య౦గ్ టైగర్ ఎన్ఠీఆర్ కదానాయకుడి గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రూపుదిద్దుకుంటోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం….చిత్రీకరణ దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు.

అభిమానులకి మాట ఇచ్చినట్టే కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.
‘అనగనగనగా అరవిందట తన పేరు; అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు, అరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్లు అసలేమైపోతారు అన్యాయం కదా ఇది అనరే ఎవరూ ‘ అంటూ సాగిన సీతారామ శాస్త్రి లిరికల్ కి తమన్ బాణీ జోడై అర్మాన్ మాలిక్ స్వరం లో కొత్తగా అనిపిస్తూ మనసు కు ఎంతో హత్తుకునేలా ఈ పాట సాగుతుంది.

సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన ఈ లిరికల్ వీడియో ఖచ్చితంగా సినిమా పై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను జరుపుకుని, దసరా కానుక గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.