Home రాజకీయాలు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ సంచలన నిర్ణయం

SHARE

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బండ్ల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌ పై షాద్ నగర్ నుంచి పోటీ చేయవచ్చు అని సమాచారం.

ఢిల్లీ లో ఏఐసీసీ కార్యాలయం లో ఈ రోజు జరగనున్న కార్యక్రమం లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆయనతోపాటు మరికొందరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గణేశ్ చేరికతో షాద్ నగర్‌లో కాంగ్రెస్ మరింత బలంగా అవటం ఖాయమని అందుకు బండ్ల సినీ గ్లామర్ బానే ఉపయోగపడొచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.