Home రాజకీయాలు పోలవరం గేలరీ వాక్ ….బాబు గారి ఈవెంట్ల లీలలు

పోలవరం గేలరీ వాక్ ….బాబు గారి ఈవెంట్ల లీలలు

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవెంట్లు బహు చిత్రం…పేరు గొప్పా ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే…అలంటి కోవలోదే ఈ పోలవరం గేలరీ వాక్ కూడా.

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో సార్లు పైలాన్ లని శంకుస్థాపనలనీ ఈవెంట్లు చేసిన బాబు ఇప్పుడు కుటుంబ సమేతంగా గ్యాలరీ వాక్ అ౦టు ఓ సరికొత్త కార్యక్రమం నిర్వహించారు. తన సతీమణి, కుమారుడు, కోడలు, మనుమడు తో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వీరితో పాటుగా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ తమ కుటుంబాలతో బస్ లలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రచార ప్రకటనలలో కేవలం చంద్రబాబు పోటో మాత్రమే వాడుకోవటం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఆర్దిక సాయం ఇస్తున్నా, కనీసం ప్రదాని మోడీ పోటో కానీ కేంద్రానికి సంబందించిన చిహ్నం కానీ లేకుండా ప్రచార ప్రకటన ఇచ్చుకోవటం ఎం నైతికత. సరే ఎప్పటిలానే పోలవరం లో మరో పైలాన్ బాబు ఆవిష్కరించారు!!