Home రాజకీయాలు రాజధాని పేర టీడీపీ నేతలు రియల్ఎస్టేట్ వ్యాపారాలు: సోము వీర్రాజు

రాజధాని పేర టీడీపీ నేతలు రియల్ఎస్టేట్ వ్యాపారాలు: సోము వీర్రాజు

SHARE

ఏపీ టీడీపీ నేతల పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విరుచుకుపడ్డారు. ఈ రోజు శాసనమండలి లో రాజధాని అమరావతి పై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ పై తెదేపా నేతలు విమర్శలు చేయడాన్ని సోము వీర్రాజు తీవ్రంగా నిరసించారు. అంతేకాక శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం, అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎం ఎల్ సీ మాట్లాడుతూ, బీజేపీ తో టీడీపీ కలిసి ఉన్నన్నాళ్ళూ పొగుడుతూ తీర్మానాలు చేశారని, ఎన్డీఏ నుంచి తెదేపా ఏ రోజైతే విడిపోయిందో అప్పటి నించి మోదీ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం రాజధాని అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రోత్సహిస్తోందని…తెదేపా నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తే, వర్షమొస్తే కారిపో యే తాత్కాలిక చవకబారు భవనాలు కట్టారని ఆరోపించారు.