Home రాజకీయాలు తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఓవైసీ

తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? ఓవైసీ

SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు అని ….నాయుడు గారు ఇక్కడికొచ్చినా పెద్దగా చేసేదేమీ ఉండదు…జీరోకావడం తప్ప అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి రాజధాని నిర్మించావో ముందు చూసుకో చంద్రబాబు. గట్టిగా వర్షం వస్తే మీ ఆఫీసులోకే (సెక్రటేరియట్‌) నీళ్లు వస్తున్నాయి అని బాబుని ఓవైసీ ఎద్దేవా చేశారు.

బాబు పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఒవైసీ నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీ తో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ మళ్లీ బీజేపీ తో కలవడం ఖాయం అని కూడా అసదుద్దీన్ జోస్యం చెప్పారు.

ముస్లింలపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు నోరుకూడా విప్పలేదు అని అసలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఇప్పుడు అదే పార్టీతో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుంది….తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయింది అని అసదుద్దీన్ మండిపడ్డారు.

టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ల పొత్తు ను ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారన్నారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీలు కూడా నిండా మునుగుతాయి అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంను ఒంటరిగా ఢీ కొనే దమ్ములేకే టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తుల కోసం పాకులాడుతున్నాయి అని కూడా ఓవైసీ అన్నారు.