Home రాజకీయాలు డైవర్షన్ స్టార్ శివాజీ…!!

డైవర్షన్ స్టార్ శివాజీ…!!

145
SHARE

శివాజీ ఆపరేషన్ గరుడ పురాణం అంటూ మళ్లీ మొదలు పెట్టడం కేవలం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ల పొత్తు విషయం ప్రజల నించి దృష్టి మరల్చేందుకే అని బీజేపీ విమర్శించింది. ఇది కూడా శివాజీ తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో మాట్లాడుతున్నరు అని బిజెపి అంది.

ఆపరేషన్ గరుడ అంటూ మతి భ్రమించినట్టు శివాజీ మాట్లాడుతున్నారని భాజపా అదికార ప్రతినిది కోట సాయికృష్ణ చెప్పారు. బిజెపి నాయకత్వం పై శివాజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సరిగ్గా ఐదు నెలల క్రితం ఇదే శివాజీ ఆపరేషన్‌ గరుడ అంటూ సంచలనం సృష్టించారు కానీ అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అంటూ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పై విష ప్రచారం చేయడానికే ఆపరేషన్ గరుడ అనే విషయం మాట్లాడారని ఆరోపించారు.

టీడీపీ కాంగ్రెస్‌ ల పొత్తు అపవిత్రమైందని, కాంగ్రెస్‌ తో పొత్తు వల్ల స్వర్గీయ ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభి౦చడం ఖాయమని వ్యాఖ్యానించారు. గతంలో సోనియా గాంధీ ని దెయ్యం అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు.